W.G: జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అలాగే గంజాయి రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.