TG: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆస్తులను అటాచ్ చేస్తామని DCP కవిత వెల్లడించారు. ఇందుకోసం ఈడీ, సీబీఐకి కూడా లేఖ రాస్తామని చెప్పారు. అలాగే, అతడి భాగస్వాముల వివరాలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. బెట్టింగ్ యాడ్స్‌తో రవికి భారీగా డబ్బులు వచ్చినట్లు తెలిపారు.