అన్నమయ్య: రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఇవాళ జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. PGRS అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించాలని సూచించారు.