విశాఖలో భాగస్వామ్య సదస్సును విజయవంతంగా నిర్వహించటంలో కీలకపాత్ర పోషించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్లను జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సత్కరించారు. అందరినీ సరైన దిశలో నడిపిస్తూ సదస్సును విజయవంతగా నిర్వహించారన్నారు. మిగిలిన జిల్లా అధికారులకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచారని ప్రతినిధులు కొనియాడారు.