MLG: వాజేడు మండల కేంద్రంలో మత్స్యకారుడు జవ్వ రవి సోమవారం చేపల వేటకు వెళ్లగా వలలో వింత చేప చిక్కింది. తాను ఎప్పుడూ చూడని ఆకారంలో ఉన్న ఈ చేప తొలిసారిగా వలలో పడిందని రవి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ చేపను చూసేందుకు పరుగులు పెట్టారు. వింత రూపం కలిగిన ఈ చేప ఏ జాతికి చెందినదో తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగింది.