KMR: బాన్సువాడ పట్టణం కోటగల్లిలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ సంస్థ ఛైర్మన్ కాసుల బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.