NZB: డొంకేశ్వర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో బాలికలకు కరాటే, కర్రసాము శిక్షణ తరగతులు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయులు (GHM) సురేష్ కుమార్ తెలిపారు. వారంలో మూడు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం మూడు నెలలపాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఆయన సూచించారు.