GDWL: సాగునీటి పంపకాల విషయంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో సోమవారం ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత తీర్పును వెలువరించారు. 2018లో జరిగిన ఈ ఘటనలో జిల్లా కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.