ADB: విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని కష్టపడి సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ‘పోలీసు అక్క’ కార్యక్రమంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మహిళలకు రక్షణగా షీ టీం,పోలీసు అక్క, జిల్లా పోలీసు వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు.