MDK: కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ ఆలయంలో సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. శివలింగం ఆకారంలో దీపోత్సవం చేశారు. అనంతరం స్థానిక మంజీరా నది పాయలో గంగాహారతి, ఆలయ ప్రాంగణంలో ఆకాశదీపం ఆవిష్కరించి దర్శించుకున్నారు.