NLG: ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి, గ్రాడ్యుయట్, D/B/M- Pharmacy చదివిన వారు అర్హులని తెలిపారు.