కోనసీమ: దివ్యాంగులకు చేయూతగా ఉచిత మూడు చక్రాల వాహనాలివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సోమవారం అన్నారు. ఈ అవకాశాన్ని 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలవారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన వారు ఈ నెల 25వ తేదీలోగా లింక్ క్లిక్ చేసి ధరఖాస్తు చేసుకోవాలన్నారు.