MBNR: దేశంలో మహిళలకు రక్షణ కరువైందని SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ అన్నారు. CITU జిల్లా కార్యాలయంలో జరిగిన ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో షీ టీమ్స్ నిఘాను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.