ADB: ఇందిరమ్మ ఇళ్లకు నాణ్యమైన ఇసుకను సరఫరా చేస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. సోమవారం ఉట్నూర్ మండలంలో శాండ్ బజార్‌ను వారు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు నాణ్యమైన ఇసుక సరఫరా చేయడమే లక్ష్యంగా శాండ్ బజార్‌ను ప్రారంభించామన్నారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో యువరాజ్ పాల్గొన్నారు.