TPT: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈనెల 9న బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. 12న బాలికను గుర్తించిన పోలీసులు ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు పోక్సో చట్టం కింద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని DSP భక్తవత్సలం హెచ్చరించారు.