PLD: మాచవరం మండలం మాచవరం గ్రామంలోని జీకే స్కూల్ వద్ద మాచవరం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జెండర్ రిసోర్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సోమవారం రిబ్బన్ కట్ చేసి రిసోర్స్ సెంటర్ను ప్రారంభించారు. మహిళలకు న్యాయ అవగాహన, పరిరక్షణ, సంప్రదింపుల కోసం ఈ కేంద్రం ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.