NDL: కొలిమిగుండ్ల మండలం బంధార్లపల్లె గ్రామ సమీపంలో ఉన్న మల్లేశ్వర స్వామి ఉత్సవాలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.