NLR: సంగం మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో నిర్వహిస్తున్న లేప్రసీ సర్వేను జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఖాదర్ వలీ సోమవారం పరిశీలించారు. సర్వే నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వ్యక్తిని శరీరం మొత్తం పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.