MBNR: పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి (వీసీ) ప్రొ. జీ.ఎన్. శ్రీనివాస్ సోమవారం ఫార్మసీ కళాశాల, పీజీ కళాశాల, సైన్స్ బ్లాక్ తరగతి గదులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరు, బోధనా కార్యక్రమాల నిర్వహణ, వసతుల కల్పనపై ఆయన సమీక్షించారు. యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని వీసీ తెలిపారు.