VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 29 ఫిర్యాదులను SP దామోదర్ సోమవారం స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ వ్యవహారాలు 11, కుటుంబ కలహాలు 6, మోసాలు 3, నగదు వివాదం 1, ఇతర ఫిర్యాదులు 8 ఉన్నట్లు తెలిపారు. అన్ని ఫిర్యాదులను 7 రోజుల్లోపు పరిష్కరించాలని, చర్యల వివరాలు నివేదికగా పంపించాలని ఆయన సూచించారు.