ATP: గుంతకల్లు పట్టణంలోని 60 ఫీట్ రోడ్డులో సోమవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 6 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్యాస్ సిలిండర్ లీకైన దానిపై విచారణ చేపట్టారు.