»While Car Parking 3 Years Old Girl Died In Apartment At Hayathnagar
Hayatnagarలో దారుణం.. అపార్ట్ మెంట్ లో చిన్నారిపై నుంచి వెళ్లిన కారు
మూడేళ్లుగా ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి బాబు (7), లక్ష్మి (3) సంతానం. పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత తన కుమార్తె లక్ష్మితో కలిసి నిద్రపోయింది.
వాహనం తీసేప్పుడు ఒక్కసారి కారు కింద.. అటు ఇటు చూసుకుని వెళ్తే ఘోర ప్రమాదాలు (Tragedy Incidents) తప్పుతాయి. మూగజీవాలతో పాటు ఏమైనా వస్తువులు ఉన్నాయేమోనని ఒక్కసారి కారు కింద.. ముందు చూసుకుని వెళ్తే మంచిది. దీనివలన కారుతో పాటు ఇతర వాటికి ప్రమాదం ఉండదు. అలా చూసుకోకుండా కారును ముందుకు పోనివ్వడంతో ఓ చిన్నారి ప్రాణం పోయింది. అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలంలో (Parking Place) గమనించకుండా కారును తీయడంతో దాని చక్రాల కింద నలిగి బాలిక మృతి చెందిన సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా (RangaReddy District) హయత్ నగర్ (Hayatnagar)లోని లెక్చరర్స్ కాలనీలో బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ (Balaji Archade) ఉంది. ఈ భవనం పక్కనే భవన నిర్మాణ పనుల కోసం కర్ణాటకకు (Karnataka) చెందిన భార్యాభర్తలు కవిత, రాజు అక్కడకు వచ్చారు. మూడేళ్లుగా ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి బాబు (7), లక్ష్మి (3) సంతానం. పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత తన కుమార్తె లక్ష్మితో కలిసి నిద్రపోయింది. కొద్దిసేపటికి నీడ కోసం బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ లోని పార్కింగ్ స్థలంలో పాపను నిద్రపుచ్చి వెళ్లిపోయింది.
భవన నిర్మాణ పనిలో కవిత మునిగిపోయింది. ఈ సమయంలో అపార్ట్ మెంట్ వాసి హరిరామకృష్ణ తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో కారు పెట్టేందుకు వచ్చారు. పాప (Child Baby) నిద్రపోతున్న విషయం గమనించకుండా కారు ముందుకు పోనిచ్చారు. తలపై నుంచి కారు టైర్ వెళ్లడంతో పాప తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో తల్లి కవిత హతాశయురాలైంది. వెంటనే ఆస్పత్రికి (Hospital) తరలించగా పాప ప్రాణంతో లేదు. పాప మృతితో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె తప్పిదంతోనే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో (CC Footage) నిక్షిప్తమయ్యాయి. ఆ ఘటనను చూస్తే అందరినీ కలచివేస్తోంది.