SKLM: విశాఖలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ పెట్టుబడులు రాబట్టే దిశగా మంత్రి లోకేష్ కీలక చర్యలు తీసుకున్నారని అన్నారు.