కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పట్టించుకోకపోవడంతో వారు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు అమలాపురం సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద ‘పెన్షనర్ల విద్రోహ దినం’ పేరుతో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఇప్పటికైనా వారి సమస్యలను పట్టించుకోవాలని కోరారు.