»Heroine Drugs Worth Rs 47 75 Crore Seized At Delhi International Airport With Cameroon Nationals
Drugs seized: రూ.47.75 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi international airport)లో భారీగా డ్రగ్స్(drugs) దొరికింది. ఇద్దరు కామెరూన్ దేశస్థుల నుంచి రూ.47.75 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ విమానాశ్రయం(Delhi international airport)లో పెద్ద ఎత్తున డ్రగ్స్(Drugs seized) పట్టుబడింది. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న 6.822 కిలోలు ఉన్న రూ.47.75 కోట్ల విలువైన హెరాయిన్(heroine)ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఇద్దరు కామెరూన్ దేశానికి(Cameroon nationals) చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో ఒక పురుషుడు, ఒక మహిళ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం మలావియా రాజధాని లిలాంగ్వే నుంచి అడిస్ అబాబా మీదుగా ప్రయాణికులు ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. హెరాయిన్ వారి బ్యాగ్‌ల లోపలి నుంచి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడం వల్ల డ్రగ్స్ అక్రమ రవాణా కార్యకలాపాలకు పెద్ద దెబ్బ అని ఓ అధికారి పేర్కొన్నారు.