పారిపోయిన గేదెల మంద (Buffaloes) ఒక జంట కొత్త స్విమ్మింగ్ పూల్‌ను ధ్వంసం చేయడం ద్వారా- ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18 గేదెలు సమీపంలోని పొలం నుంచి తప్పించుకుని ఎసెక్స్ స్విమ్మింగ్ పూల్‌లో ఉదయం స్నానం చేశాయి. జంతువులు పూల్ కవర్ గుండా పడి 25,000 పౌండ్ల (రూ. 25,00,000) నష్టం కలిగించిన ఘటనను CCTVలో రికార్డ్ అయింది.
రిటైర్డ్ అయిన ఆండీ మరియు లినెట్ స్మిత్ గార్డియన్‌తో మాట్లాడుతూ, ఎనిమిది గేదెలు 70,000 పౌండ్ల కొలనులో పడిపోయాయి. ఆ క్రమంలో ఫెన్సింగ్, పూల మొక్కల వరుసను నాశనం చేశాయి. గత సంవత్సరం జూలైలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పనిచేయలేదు. మంద ఒక చెక్క కంచెను దాటుకుని వచ్చి తోటను నాశనం చేశాయి.
“నా భార్య ఉదయం టీ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆమె వంటగది కిటికీలోంచి బయటకు చూసింది. కొలనులో ఎనిమిది గేదెలు ఉన్నాయి” అని ఆండీ స్మిత్ గార్డియన్‌తో చెప్పాడు. “ఆమె 999కి కాల్ చేసింది. అగ్నిమాపక దళం మా కాల్ ను ఫేక్ కాల్ అని అనుకున్నారు. మమ్మల్ని సీరియస్‌గా తీసుకునేలా వారిని ఒప్పించవలసి వచ్చింది.
వారు వచ్చినప్పుడు, వారి హాయ్-విస్ జాకెట్లను చూసి బెదరగొట్టిన గేదెలలో ఒకటి నేరుగా వారి వైపుకు వెళ్లింది. .” అని చెప్పారు. NFU మ్యూచువల్ ఇన్సూరెన్స్ ప్రతినిధి మాట్లాడుతూ, క్లెయిమ్ “పరిష్కరించబడింది”.
“ఈ క్లెయిమ్‌ను చెల్లించడంలో ఆలస్యమైనందుకు ప్రత్యేకించి ఇన్స్పెక్టర్ సందర్శన కోసం ప్రారంభంలో వేచి ఉన్నందుకు మేము క్షమాపణలు కోరుతున్నాము, ఇది చాలా సమయం పట్టింది. మా సాధారణ ప్రమాణాల కంటే తక్కువగా ఉంది.” అని ఇన్సురెన్స్ ప్రతినిధి తెలిపారు.
It's hot but it's not that hot! Moment herd of escaped water #buffalo stampede through couple's garden and take dip in their swimming pool – causing £25,000 in damage to their Colchester #Essex home pic.twitter.com/uYM8kZpwgP