AP: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి చెందారు. మక్కా యాత్రకు వెళ్లిన ప్రయాణికులు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి లోకేష్ మృతులకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, బస్సు ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన విషయం తెలిసిందే.