కరీంనగర్: గంగాధర మండలం వెంకంపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి గ్రామప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.