నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న మసీద్ నిర్మాణ పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమ ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు.