కోనసీమ: పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉంది. దక్ష ప్రజాపతి పేరు మీదుగా ద్రాక్షారామంకి ఆ పేరు వచ్చిందని పురాణాలు చేప్తున్నాయి. ఈ ఆలయం 7వ శతాబ్దంలో చాళుక్యుల కాలం నాటిది అని, విష్ణువు మార్గదర్శకత్వంలో దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తి పీఠంగా ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే.