CTR: చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.