అన్నమయ్య: రామాపురం (M) బండపల్లి సమీపంలో రాయచోటి-కడప ప్రధాన రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలన్నాగారిపల్లి వాసి రైతు కోటకొండ పెద్ద రెడ్డి (57) కూరగాయలు తీసుకుని రాయచోటి మార్కెట్కు వెళ్తున్నాడు. అతని ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఘటన జరిగింది. తీవ్రగాయాలపాలైన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు వాహదారులు తెలిపారు.