అన్నమయ్య: రాజంపేటలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తాను విశేషంగా కృషి చేసినట్లు టీడీపీ ఇంఛార్జ్ జగన్ మోహన్ రాజు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రాజంపేట పరిసర ప్రాంతాల్లో రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీ రూ. 200 కోట్ల పెట్టుబడితో కొత్త పారిశ్రామిక యూనిట్ ప్రారంభించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. దీని వల్ల స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.