హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన సహారా సీనియర్ ఫీల్డ్ అసిస్టెంట్ జగదీష్, ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థత గురైన జగదీష్‌ను కుటుంబ సభ్యులు, నగరంలోని కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. జగదీష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. సహారా కంపెనీ సంతాపం ప్రకటించింది.