MNCL: టెట్ అర్హత పరీక్ష నుంచి సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్ కోరారు. ఇవాళ జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. 2010 కంటే ముందే నిబంధన ప్రకారమే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ జరిగిందన్నారు. నాడు ఉద్యోగం సాధించిన సీనియర్ టీచర్లకు టెట్ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు.