దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులైన రజనీకాంత్, నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. తమ సినీ కెరీర్లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)లో వారికి సన్మానం చేయనున్నారు. IFFI ముగింపు వేడుకల్లో ఈ ఇద్దరు స్టార్ హీరోలను ప్రత్యేకంగా సత్కరించాలని నిర్ణయించారు.