WGL: CCI నిబంధనలపై నిరసనగా ఉమ్మడి WGL జిల్లాలోని జిన్నింగ్ మిల్లర్లు నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. మిల్లులను L1, L2 కేటగిరీలుగా విభజించి, తక్కువ పరిమాణంలోనే కొనుగోలు అనుమతించడం వల్ల మిల్లర్లకు భారీ నష్టం వాటిల్లుతోందని అసోసియేషన్ తెలిపింది. అకాల వర్షాలతో దిగుబడి తగ్గిన.. మళ్లీ కొనుగోలు ఆపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.