SRPT: మోతె మండలం సిరికొండ గ్రామంలో ఆదివారం రాత్రి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాలు విషాదాంతానికి దారితీశాయి. స్థానిక సమాచారం మేరకు భర్త కారింగుల వెంకన్న, తమ భార్య పద్మ (40)తో వివాదం తలెత్తడంతో ఆవేశానికి లోనై రోకలిబండతో ఆమె తలపై బలంగా కొట్టడంతో ఆమె మరణించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.