ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలోని డ్రైనేజీ సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోందని, దీంతో దోమల బెడద ఎక్కువై రోగాల బారిన పడుతున్నామన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.