KMR: ఈ నెల 18న మాస శివరాత్రి సందర్భంగా, సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన తాండూర్ త్రిలింగ రామేశ్వర దేవాలయం వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు ఆదివారం పక్రటనలో తెలిపారు. మొట్టమొదటిసారిగా ఆలయంలో నిర్వహించనున్న ఈ వ్రత కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజల్లో పాల్గొన్నాలన్నారు.