ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలు రెండో రోజు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో బాలురు విభాగంలో విశాఖ టీం విజేతగా నిలిచింది. రన్నర్స్‌గా ఈస్ట్ గోదావరి, బాలికల విభాగంలో విజేతగా విశాఖ, రన్నర్స్‌గా వెస్ట్ గోదావరి టీంలు నిలిచాయి. విజేతలగా గెలిచిన వారికి ఎమ్మెల్యే సాంగ రోషన్ కుమార్ అవార్డులు అందజేశారు.