MDK: ఆధునిక పరిజ్ఞానం పెరిగినప్పుడు సైబర్ నేరగాళ్లు రోజు రోజు నూతన పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటూ లోన్ యాప్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎన్నిసార్లు ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల వలలో పడిన వారు చాలామంది ఉన్నారు.