BHNG: తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు 17న బంద్ ప్రకటించడంతో జిల్లా రైతులకు కలెక్టర్ హనుమంత రావు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. రైతులు 17న పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు లేదా జిన్నింగ్ మిల్లులకు అమ్మకానికి తీసుకురాకూడదని, ఆ సీసీఐ యాప్లో స్లాట్ బుకింగ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.