SRCL: వేములవాడ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామివారిని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.