ప్రకాశం: కొండపి నియోజకవర్గంలో లబ్ధిదారులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్స్ పంపిణీ చేశారు. తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ మరియు NECC సహకరంతో వీటిని అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.