MNCL: బెల్లంపల్లి MLA గడ్డం వినోద్‌ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని నెన్నెల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టు మల్లేష్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. BJP నాయకుడు ఏమాజీకి MLAను విమర్శించే అర్హత లేదన్నారు. ఏమాజీ తాను లాయర్ అని చెప్పి ఎన్ని అక్రమ వసూళ్లు చేశాడో తమ వద్ద చిట్టా ఉందని ఆరోపించారు. MLAపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.