SKLM: ఎచ్చెర్లలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు సహస్ర తులసి దళార్చన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి,పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. అదే విధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.