శ్రియ(Shriya saran) హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఈ మధ్యలో వచ్చిన పలువురు హీరోయిన్లు అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. శ్రియ మాత్రం సౌత్ జెండా పాతేసింది. తెలుగులో మెగాస్టార్(Megastar) మొదలుకుని.. దాదాపుగా అందరు స్టార్ హీరోలతోను ఈ అమ్మడు రొమాన్స్ చేసింది. 22 ఏళ్ల సినీ కెరీర్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవించింది శ్రియ. అయితే 2018లో ఆండ్రూని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు పాప కూడా ఉంది. అయినా కూడా గ్లామర్ విషయంలో శ్రియ తగ్గేదేలే అంటోంది. రోజు రోజుకి ఈ అమ్మడి అందం పెరుగుతోంది తప్పా తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో గ్రీన్ కలర్ ధరించిన చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.