కోనసీమ: HPV టీకాను జిల్లాలో 14 ఏళ్లు దాటి 15 ఏళ్ల లోపు గల బాలికలకు వేయించి గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద HPV వ్యాక్సిన్ ప్రచార బ్యానర్లను ఆవిష్కరించారు. 14ఏళ్లు దాటిన ప్రతి బాలికకు వ్యాక్సినేషన్ వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.