ATP: పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు. అనంతపురంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాఠశాలలో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ్ర’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం ఒక క్లాస్ పీరియడ్లో పరిశుభ్రత, పచ్చదనంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.